bastar the naxal story ott: ఓటీటీలో ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్‌’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Published : 08 May 2024 14:56 IST

హైదరాబాద్‌: ‘ది కేరళ స్టోరీ’ దర్శక-నిర్మాతలు సుదీప్తోసేన్‌, విపుల్‌ అమృత్‌లాల్‌ షాలు తెరకెక్కించిన మరో చిత్రం ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ (Bastar The Naxal Story). అదాశర్మ (Adah Sharma) కీలక పాత్ర పోషించింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదికగా జీ5 వేదికగా మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.

బస్తర్‌ ప్రాంతంలోని సామాన్య ప్రజలపై మావోయిస్టులు సాగించిన అమానుషాలు.. మందుపాతర పేల్చి 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనపెట్టుకున్న వైనం తదితర అంశాలతో ఈ మూవీని తీర్చిదిద్దారు. మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్‌ అధికారి నీరజా మాధవన్‌గా అదాశర్మ కనిపించారు. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూనే.. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడానికి ఆమె ఎలాంటి చర్యలకు దిగింది?ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే చిత్ర కథ. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువగా చూపిస్తూ.. సంచలనం కోసమే ఈ చిత్రం తెరకెక్కించారన్న విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని