Panchayat 3: ‘పంచాయత్‌ సీజన్‌ 3’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

‘పంచాయత్‌ సీజన్‌ 3’ వెబ్‌సిరీస్‌ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ కానుందంటే?

Published : 02 May 2024 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘పంచాయత్‌ 3’ (Panchayat Season 3) ఒకటి. సీజన్‌ 3 ఎప్పుడు విడుదలవుతుందా? అన్న ఉత్కంఠకు తెర పడింది. స్ట్రీమింగ్‌ డేట్‌ని ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) ఖరారు చేసింది. మే 28 నుంచి ఈ సిరీస్‌ అందుబాటులో ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ఇంకా అన్ని రోజులు వెయిట్‌ చేయాలా?’ అంటూ కొందరు, ‘ఐ యామ్‌ వెయిటింగ్‌’ అంటూ మరికొందరు నెటిజన్లు, సిరీస్‌ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు ‘మీర్జాపూర్‌ 3’ రిలీజ్‌ కూడా చెప్పండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉద్యోగావకాశాలు లేక ఓ మారుమూల గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా విధుల్లోకి చేరతాడు ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అభిషేక్‌ త్రిపాఠి. అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలేంటన్నదే పంచాయత్‌ (Panchayat) వెబ్‌ సిరీస్‌ స్టోరీ.   ఈ కామెడీ డ్రామా సిరీస్‌లో అభిషేక్‌ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్‌ (Jitendra Kumar) మంచి మార్కులు కొట్టేశారు. దీపక్‌కుమార్‌ మిశ్రా దర్శకుడు. 2020 ఏప్రిల్‌ 3న సీజన్‌1, 2022 మే 20న సీజన్‌ 2 విడుదలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని