Updated : 23/11/2021 23:34 IST

Priyanka Chopra: ప్రియాంక చోప్రా-నిక్‌ జొనాస్‌ విడిపోతున్నారా..?

ఇంటర్నెట్‌డెస్క్‌: గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా, తన భర్త పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ విడిపోతున్నారా? ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో ప్రియాంక అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనికి కారణం ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ నుంచి తన భర్త ఇంటి పేరు జొనాస్‌ పేరును తొలగించడమే. ప్రియాంక చోప్రా తాజాగా తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల నుంచి ‘చోప్రా జొనాస్‌’ పేరును తొలగించింది. కేవలం ప్రియాంక పేరుతోనే తన ఖాతాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో ప్రియాంకపై ప్రస్తుతం అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తన భర్త నుంచి ప్రియాంక విడిపోతున్నారా? ఇది నిజమా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

అయితే ఈ వార్తపై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించారు. వారు విడిపోతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. అవన్నీ చెత్త వార్తలని, పుకార్లని పేర్కొన్నారు. వాటిని వ్యాప్తి చేయవద్దన్నారు. ఈ వార్తలపై ప్రియాంక చోప్రా స్నేహితురాలు కూడా స్పందించారు. అవన్నీ పుకార్లు మాత్రమే అని, వాటిలో వాస్తవం లేదన్నారు. ప్రియాంక భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్‌ల కోసమే తన పేరును ఇలా మార్చుకున్నారని తెలిపారు. తన ఖాతాల పేర్లలో నుంచి కేవలం ‘జొనాస్‌’ పేరు మాత్రమే కాకుండా ‘చోప్రా’ పేరు కూడా తొలగించిందని చెబుతున్నారు. 

గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక, అమెరికా పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ ఒక టీవీ షోలో కలిసి నటించారు. దీంతో వీరిమధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో 2018లో ఇరుకుటుంబాల సమక్షంలో రాజస్థాన్‌లో వైభవంగా జరిగిన వివాహ వేడుకలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక అప్పటి నుంచి ఈ జంట తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునేవారు. ఎక్కడికి వెళ్లిన తమ ప్రేమను ఇరువురు ఒకరిపైఒకరు చూపించుకునేవారు. ఇటీవల దీపావళి వేడుకల్లో జొనాస్‌తో కలిసి పూజలో పాల్గొన్న ఫొటోను ప్రియాంక షేర్‌ చేసింది. అయితే సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ నుంచి తన భర్త పేరు తొలగించడానికి కారణం ఏమై ఉండొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. 

తమ నాలుగేళ్ల వైవాహక బంధానికి ముగింపు పలుకుతూ టాలీవుడ్‌ జంట సమంత-నాగచైతన్య ఇటీవలే విడిపోయి అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడిపోవడానికి ముందు సమంత  తన సోషల్‌మీడియా ఖాతాల్లోని ప్రొఫైల్‌లో అక్కినేని పేరు తొలగించడంతో సినీవర్గాలతో పాటు నెటిజన్లలో  సందేహం కలిగింది. దీంతో కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. సమంత-చైతూ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు, త్వరలోనే వీరు విడిపోయే అవకాశం ఉందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వార్తలను నిజం చేస్తూ అక్టోబర్‌ 2న ఈ స్టార్‌ జంట తమ వైవాహక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని