Project K: రామోజీ ఫిల్మ్‌సిటీలో‘ప్రాజెక్ట్‌ కె’

ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ - కె’. దీపికా పదుకొణే కథానాయిక. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత.  అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది

Updated : 13 Feb 2022 08:14 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ - కె’. దీపికా పదుకొణే కథానాయిక. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత.  అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న అత్యంత ఖరీదైన పాన్‌ ఇండియా చిత్రమిది.  విజయవంతమైన ‘మహానటి’ తర్వాత నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని