Updated : 24 Jan 2022 14:01 IST

Pushpa: షూట్‌కు ముందే అత్యంత భారీ ఆఫర్‌.. నో చెప్పిన మైత్రి!

హైదరాబాద్‌: కరోనా కారణంగా సందడి కోల్పోయిన తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగులు నింపారు దర్శకుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా రానున్న ‘పుష్ప ది రూల్‌’ కోసం ప్రేక్షకులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రెండో పార్టును పట్టాలెక్కించాలని చిత్రబృందం భావిస్తోంది.

ఇదిలా ఉండగా, ‘పుష్ప-2’కి సినీ ప్రియుల్లో ఉన్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని కొన్ని సంస్థలు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా షూటింగ్‌ కూడా ప్రారంభం కాని ఈ సినిమా కోసం భారీగా డబ్బులు చెల్లించడానికి కూడా వెనకాడటం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ.. ‘పుష్ప 2’ థియేరిటికల్‌ రైట్స్‌ కోసం రూ.400 కోట్లు ఆఫర్‌తో ముందుకు వచ్చిందట. కానీ, నిర్మాతలు మాత్రం అందుకు సుముఖంగా లేరని.. సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యాకే బిజినెస్‌పై దృష్టి పెట్టాలని మైత్రీ మూవీ మేకర్స్‌ వర్గాలు భావిస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించారు. ఓ సాధారణ కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌కు అధినేతగా పుష్పరాజ్‌ ఎలా ఎదిగాడు అనేది ‘పుష్ప ది రైజ్‌’లో చూపించారు. పుష్పరాజ్‌పై ఆగ్రహంగా ఉన్న పోలీస్‌ అధికారి భన్వర్‌ సింగ్‌ శెకావత్‌ (ఫహద్‌ ఫాజిల్‌), ద్రాక్షాయణి (అనసూయ) అతన్ని నాశనం చేయడానికి ఎలాంటి ప్లాన్స్‌ వేయనున్నారు? వాటిని పుష్ప ఎలా ఎదుర్కోనున్నాడు?.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో పార్ట్‌ 1కి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్‌’ సిద్ధం కానుంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్