Shilpa Shetty: శిల్పాకు విలువైన ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసిన రాజ్‌కుంద్రా
అశ్లీల చిత్రాల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు చెందిన కొన్ని విలువైన ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు ఆయ...
ముంబయి: అశ్లీల చిత్రాల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు చెందిన కొన్ని విలువైన ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు ఆయన ట్రాన్స్ఫర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జుహూలోని ఓ అపార్ట్మెంట్లో తన పేరుపై ఉన్న ఐదు ఫ్లాట్స్‌ని కుంద్రా.. శిల్పా పేరు మీదకు మార్చారు. ఈ ఐదు ఫ్లాట్స్ విలువ రూ.38.5 కోట్లు ఉంటుందని సమాచారం. రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం సుమారు రూ.2 కోట్లు చెల్లించినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తుంది. అయితే, ఉన్నట్టుండి రాజ్‌కుంద్రా తన ఆస్తులను శిల్పా పేరు మీదకు ఎందుకు మార్చారనే విషయంపై ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతోంది. తన సతీమణి శిల్పాపై ఉన్న ప్రేమతోనే కుంద్రా ఇలా చేసి ఉంటారని కొందరు అంటుంటే మరికొంతమంది మాత్రం వీళ్లిద్దరూ విడాకులకు అప్లయ్ చేసినట్లు ఉన్నారు. అందుకే ఆస్తులు పంచుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!