Rashmika: అప్పుడు నోరు కట్టేసుకోలేను!

‘‘నేను మంచి ఆహార ప్రియురాల్ని. ప్రపంచంలోని అన్ని ఆహారాల్ని ప్రయత్నించాను.. పరీక్షించాను. అయితే వాటన్నింటి కన్నా ఇంటి భోజనమే ఉత్తమమైనదని గ్రహించాను’’ అంటోంది రష్మిక.

Updated : 24 Nov 2022 07:01 IST

‘‘నేను మంచి ఆహార ప్రియురాల్ని. ప్రపంచంలోని అన్ని ఆహారాల్ని ప్రయత్నించాను.. పరీక్షించాను. అయితే వాటన్నింటి కన్నా ఇంటి భోజనమే ఉత్తమమైనదని గ్రహించాను’’ అంటోంది రష్మిక (Rashmika). తెరపై చలాకీ పాత్రలతో అందరినీ అలరించే ఈ ముద్దుగుమ్మ.. తన ఆహారపు అలవాట్ల విషయమై నోరు విప్పింది. తాను ఆహార ప్రియురాలైనప్పటికీ డైట్‌ విషయంలో పక్కాగా వ్యవహరిస్తానని చెప్పింది. అయితే సుషీ, సూప్‌ నూడుల్స్‌ వంటి తనకిష్టమైన ఆహార పదార్థాలు ఎదురైనప్పుడు నోరు కట్టేసుకోలేనని తెలిపింది. అలాగే చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌ వంటి తీపి పదార్థాల్ని అమితంగా ఇష్టపడతానని.. వారాంతంలో ఎప్పుడైనా డైట్‌ తప్పితే వెంటనే తనని తాను తిరిగి ట్రాక్‌లోకి పెట్టుకునేందుకు రన్నింగ్‌పై దృష్టి పెడతానని వివరించింది. రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప 2’, ‘వారసుడు’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో ‘మిషన్‌ మజ్ను’, ‘యానిమల్‌’ సినిమాలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని