Ram charan: శంకర్‌- చరణ్‌ మూవీ.. మాస్‌ టైటిల్‌?

రామ్‌చరణ్‌(Ramcharan) కథానాయకుడిగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌(Shankar) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

Published : 05 Jun 2022 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామ్‌చరణ్‌(Ramcharan) కథానాయకుడిగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌(Shankar) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలోనే హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలను తీయనున్నారట. ఈ క్రమంలో సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ‘ఆర్‌సీ15’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈసినిమాకు ఓ మాస్‌టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్ర బృందం. రామ్‌చరణ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘సర్కారోడు’ అనే  మాస్‌ టైటిల్‌ను అనుకుంటున్నారట. అదేవిధంగా ‘అధికారి’ క్లాస్‌ టైటిల్‌పెడితే ఎలా ఉంటుందని కూడా యోచిస్తున్నారట. అనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, జయరామ్‌, శ్రీకాంత్‌, సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని