భన్సాలీ దర్శకత్వంలో షారుఖ్‌?

బాలీవుడ్‌లో చిత్రసీమలో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీది ప్రత్యేక స్థానం. ఆయన తనదైన శైలితో చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు. మరొకరెమో బాలీవుడ్ బాద్‌షా కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దేవదాస్‌’. 20 ఏళ్ల క్రితం వచ్చింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేయలేదు.

Published : 09 May 2021 00:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌లో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీది ప్రత్యేక స్థానం. ఆయన తనదైన శైలితో చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు. మరొకరు బాలీవుడ్ బాద్‌షా కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దేవదాస్‌’. 20 ఏళ్ల క్రితం వచ్చింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేయలేదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో ‘ఇజార్‌’ అనే ప్రేమకథా చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ కథను నాలుగేళ్ల కిందటే షారుఖ్‌తో కలిసి చేయాలనుకున్నాడట సంజయ్‌. చిత్ర కథంతా ఓ ప్రేమజంట చుట్టూ తిరగనుంది.  ప్రేయసి కోసం ఇండియా నుంచి నార్వేకు సైక్లింగ్ చేసిన వ్యక్తి నిజ జీవిత ఆధారంగానే భన్సాలీ ఈ కథను తయారు చేసుకొన్నాడని సమాచారం. ఇందులో షారుఖ్‌ ప్రేమ కోసం నార్వే వరకు సైక్లింగ్ చేసే పాత్రలో కనిపించనున్నారట. సంజయ్‌ స్ర్కిప్టుపై నిరంతరం కృషిచేస్తున్నారట. అయితే షారుఖ్ దీనిపై ఎలా స్పందిస్తాడో. గ్రీన్ సిగ్నల్‌ ఇస్తాడా లేదో తెలియాలి. ప్రస్తుతం సంజయ్‌ - సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హీరా మండి’ అనే వెబ్‌ సీరీస్‌ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇక షారుఖ్ ఖాన్‌ సైతం తన ‘పఠాన్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా జాన్‌ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని