ShahRukh Khan: ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘గెట్‌ వెల్‌ సూన్‌ షారుఖ్‌’.. ఎందుకంటే..?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కొవిడ్‌ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు....

Published : 06 Jun 2022 10:24 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కొవిడ్‌ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచనలు పాటిస్తూ క్వారంటైన్‌లో ఉన్నారు. షారుఖ్‌ ఖాన్‌ కరోనా బారిన పడ్డారంటూ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్వీట్ చేశారు. ‘షారుఖ్‌.. కరోనా నుంచి మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని  ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు. ‘గెట్‌ వెల్‌ సూన్‌ ఎస్‌ఆర్‌కే’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, ఇటీవల బాలీవుడ్‌ అగ్ర నిర్మాత కరణ్‌జోహార్‌ ఇచ్చిన బర్త్‌డే పార్టీలో షారుఖ్‌తోపాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ పార్టీలో పాల్గొన్న చాలామంది తారలు కరోనా బారిన పడ్డారంటూ ఆదివారం ఉదయం నుంచి పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని