Shahrukh Khan: షారుఖ్ డంకీ

సామాజిక అంశాలే ఇతివృత్తం చేసుకొని మనసుకు హత్తుకునేలా చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణి. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా ఆయన నుంచి ఓ సినిమా రానుందనే సంగతి తెలిసిందే.

Updated : 20 Apr 2022 09:23 IST

సామాజిక అంశాలే ఇతివృత్తం చేసుకొని మనసుకు హత్తుకునేలా చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణి. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా ఆయన నుంచి ఓ సినిమా రానుందనే సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్ర టైటిల్‌ను ‘డంకీ’గా ప్రకటించారు. ఈ సందర్భంగా షారుఖ్‌, హిరాణి మాట్లాడుకుంటున్న వీడియోను విడుదల చేశారు. సంజూకి ‘మున్నాభాయ్‌’, అమీర్‌కి ‘పీకే’ మరి నాకేంటి అని షారుఖ్‌ అడుగుతాడు. నువ్వు ‘డంకీ’ అని హిరాణి అనడంతో ప్రోమో ముగుస్తుంది. వీరిద్దరి కలయికలో రానున్న తొలి చిత్రం ఇదే. ఇందులో షారుఖ్‌కు జోడీగా తాప్సీ పన్నూ నటించనుంది. క్రిస్మస్‌ కానుకగా 2023 డిసెంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రాజ్‌కుమార్‌ హిరాణి ఫిల్మ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని