Game Changer: బరిలోకి గేమ్‌ ఛేంజర్‌

కథానాయకుడు రామ్‌చరణ్‌.. దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 09 Aug 2023 14:05 IST

థానాయకుడు రామ్‌చరణ్‌.. దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైంది. దాదాపు రెండు వారాలు కొనసాగనున్న ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఆగస్టు 21తో ఈ షెడ్యూల్‌ ముగియనుందని సమాచారం. రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో రామ్‌చరణ్‌ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: తిరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని