Hansika: 50వ చిత్రానికి అడ్డంకులు

‘మహా’... హన్సిక 50వ సినిమా. తమిళంలో థ్రిల్లర్‌ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. అయితే దీని విడుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి...

Updated : 16 May 2021 10:33 IST

చెన్నై: ‘మహా’... హన్సిక 50వ సినిమా. తమిళంలో థ్రిల్లర్‌ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. అయితే దీని విడుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేయాలనుకున్నారు. ఇంతలో కరోనా విజృంభించింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. ఇప్పుడు దీన్నీ ఆపాలని ఈ చిత్ర దర్శకుడు జమీల్‌ కోర్టులో కేసు వేశారు. ‘‘నాకు చెప్పకుండా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. నాకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌ చెల్లించలేదు.’’ అని జమీల్‌ హైకోర్టులో పిటీషన్‌ వేశారు. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదలకూ బ్రేక్‌ పడినట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని