Updated : 15/10/2021 22:12 IST

James bond: ఒళ్లు గగురుపొడిచే ఫైట్స్‌..

జేమ్స్‌బాండ్‌ పోరాటాలన్నీ మనల్ని కుర్చీ అంచున కూర్చోబెడతాయి. నింగి, నేల, నీరు, నిప్పు ఇలా పంచభూతాల్లో ఎక్కడైన బాండ్‌ భీకరంగా పోరాటం చేయగలడు. గాలిలో వేలాడుతూ, విమానంపై నుంచి దూకుతూ చేసే ఆ ప్రమాదకర స్టంట్స్ థియేటర్లో చూసే ప్రేక్షకుడికి ఊపిరాడనీయవు. జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో అలా ఉత్కంఠ రేపిన ఫైట్స్‌ ఏంటో చూద్దాం.

నేలపై చిక్కడూ దొరకడు

మొదటి జేమ్స్‌ బాండ్‌గా సీన్‌ కానరీ అభిమానులకు కావాల్సినంత యాక్షన్‌ అందించాడు. ఆయన నటించిన ఆరు చిత్రాల్లోనూ అదిరిపోయే ఫైట్లు ఉంటాయి. కన్నార్పకుండా చూసే పోరాటాలకు థియేటర్లు దద్దరిల్లిపోతాయి.వంద మిలియన్‌ డాలర్ల వసూళ్లుతో హాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచిన సినిమా ‘గోల్డ్‌ ఫింగర్’‌. ఇందులో హీరోయిన్‌ కార్‌ను వెంటాడే సీన్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. బాండ్‌గా ఆయన స్టైల్‌ భలే ముచ్చటేస్తుంది. కావాలంటే మీరు ఓ సారి లుక్కేయండి.


గాలిలో దూకుతూ..కళ్లు చెదిరే ఫీట్లు

బాండ్‌గా పనికి రావన్న విమర్శకులకు డేనియల్‌ క్రెగ్‌ ‘కాసినో రాయల్’ ఆరంభంలోనే స్టంట్స్‌తో గట్టి సమాధానమిచ్చాడు. విలన్‌ను పట్టుకునే క్రమంలో ఎత్తైన క్రేన్లపై నుంచి దూకుతూ ‘వారెవ్వా.. ఏం ఫైట్స్‌’ ఇవి అనిపించేలా చేశాడు. గాల్లోనే విలన్‌పై పిడిగుద్దులు కురిపిస్తూ అభిమానులకు సిసలైన యాక్షన్‌ విందును అందించాడు.


నీటిపై నావలా.. గుండెల్లో తూటాలా

రోజర్‌ మూర్‌ నటించిన ‘మూన్‌ రేకర్‌’ సినిమాలో ఫైట్స్‌ భలే గమ్మత్తుగా ఉంటాయి. అందులో నీటిపైనే రూపొందించిన ఫైట్స్‌ మంచి థ్రిల్‌ను కలిగిస్తాయి. బోట్‌పైన వాయువేగంతో దూసుకెళ్తూనే  శత్రుమూక మీద బాంబుదాడి చేస్తాడు. విలన్‌ కళ్ల ముందే బోటు నుంచి గాల్లోకి ఎగిరిపోతాడు. ఆ విన్యాసాలు చూసి విలన్‌తో పాటు, ప్రేక్షకులూ అవాక్కయ్యారు.


అచ్చంగా ఇలాంటిదే అదిరిపోయే ఫైట్‌ ‘లైసెన్స్‌ టు కిల్‌’ సినిమాలో ఉంటుంది.  నీటి అడుగున టిమోతి డాల్టన్‌ చేసిన ఫైట్లు ఓ సారి చూసేయండి.  యాక్షన్‌ సినిమాల్లో బాండ్‌ ఎందుకింత ప్రత్యేకమో తెలుస్తుంది.


 ఆకాశంలో అదిరే ఫీట్లు

టిమోతీ డాల్టన్‌ రెండు సినిమాల్లోనే బాండ్‌గా నటించాడు.  ఫైట్స్‌లోనూ, నటనలోనూ మిగతా నటులకు ఏమాత్రం తగ్గలేదు. కావాలంటే విమానంలో వేలాడుతూ చేసిన ఈ ఫైట్‌ చూడండి. నరాలు తెగేలా ఉండే ఆ ఫైట్‌ అప్పటి ప్రేక్షకులను ఊర్రూతలూగించింది.  


 అగ్నికణంలా మండుతూ

డేనియల్‌ క్రెగ్‌ గురించి తెలిసిందే కదా.! యాక్షన్‌ ఆయనకు కొట్టినపిండి. వంద మందినైనా తుక్కు కింద కొట్టగలడు. బాండ్‌ పంచభూతాల్లో ఎక్కడైనా పోరాడగలడు అని చెప్పుకున్నాం కదా. ట్రైన్‌ మీద వెళ్తూ విలన్‌పై పిడిగుద్దులు కురిపించినా, గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేసినా వీక్షకులకు మంచి కిక్కిస్తాయి ఆ ఫైట్లు. ‘క్వాంటమ్‌ ఆఫ్‌ సోలెస్‌’ సినిమాలో భగభగ మండే మంటల్లో చేసే ఫీట్లు వెండితెరకు సెగపుట్టించాయి. కావాలంటే మీరు ఓ సారి ఆ వీడియోపై లుక్‌ వేయండి.


మంచుపై దుమ్ము దులిపేస్తాడు

‘డై అనదర్‌ డే’ పియర్స్‌ బ్రాస్నన్‌ బాండ్‌గా నటించిన చివరి చిత్రం. ఇందులో కంటికి కనిపించని కారులో చేసే ఫైట్స్‌ ఆసక్తికరంగా ఉంటాయి. విలన్ల కళ్లు కప్పి మంచులో దూసుకెళ్తుంటే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కావాలంటే మీరు ఓసారి చూసేయండి. 


రైలుపై  రఫ్పాడిస్తూ..

‘స్కైఫాల్‌’ బాండ్‌ సినిమాల్లో బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి సినిమా. ఇందులో బాండ్‌ ట్రైన్‌పై చేసే ఫైట్స్‌ మంచి కిక్కునిస్తాయి. ఈ సినిమాలో డేనియల్‌ క్రెగ్‌ తనదైన యాక్షన్‌తో సినిమా ప్రియులకు పండగ చూపించాడు. 


అంతరిక్షంలో  అదిరిపోయేలా

పంచభూతాలే కాదు అంతరిక్షంలోనూ ఫైట్స్‌ చేసి వచ్చాడు బాండ్‌. కావాలంటే ఈ అద్భుతమైన ఫైట్‌ చూడండి. చూపు తిప్పుకోనివ్వని విధంగా వీటిని రూపొందించారు.  ఈ ఫైట్‌ ‘మూన్‌ రేకర్‌’ చిత్రంలోనిది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని