Devara: ఊరిస్తున్న ఎన్టీఆర్‌

‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్‌. ‘వార్‌ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా.

Updated : 08 May 2024 09:36 IST

‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్‌. ‘వార్‌ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ విషయంపై చర్చ సాగుతోంది. ఈ నెల 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు. మరి ఆ సందర్భంగా పాట హంగామా ఉంటుందో లేదో తెలియదు కానీ, ఈ ఏడాదిలో వినిపించనున్న ఎన్టీఆర్‌ సినిమాల ముచ్చట్లు ఇంకా చాలానే ఉన్నాయి. అక్టోబరు 10న ‘దేవర పార్ట్‌ 1’ సినిమా విడుదల ఖరారైన సంగతి తెలిసిందే. అది ఒకెత్తైతే... అదే నెలలోనే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించనున్న ఎన్టీఆర్‌ కొత్త సినిమా కూడా ప్రారంభం కాబోతోంది. ఒక సినిమా విడుదల, మరొక సినిమా ప్రారంభం అన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని