Arya: తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్.
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘నా జీవితాన్ని మార్చేసిన చిత్రం ఇది. నా జీవితాన్ని ప్రభావితం చేసిన దర్శకుడు సుకుమార్. ‘ఆర్య’ అనే సినిమా నా కెరీర్‌ని ట్రాక్‌లోకి తీసుకొచ్చింది’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ ‘‘కొత్త దర్శకుల్ని ఎవరూ ప్రోత్సహించేవాళ్లు లేని ఆ సమయంలో, ఎంతో ధైర్యంతో నాతో సినిమా చేశారు దిల్‌రాజు. ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉంటా. తన భవిష్యత్తుని తనే వెతుక్కున్నట్టు బన్నీ పట్టుబట్టి ఈ సినిమా చేశార’’న్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, దిల్‌రాజు, శివ బాలాజీ, దేవిశ్రీప్రసాద్, రత్నవేలుతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
ఆమిర్ నటించిన ‘గజనీ’మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నటుడు ప్రదీప్ రావత్ -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్‌గేల్‌తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్‌గేల్‌తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్‌కు ముందు అనుకున్న హీరోలెవరంటే?
సుమంత్ హీరోగా నటించిన ‘గోదావరి’కి 18 ఏళ్లు. ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్‌కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది