Sreemukhi: నన్ను నమ్మండి.. రిలేషన్‌లో లేను

‘నన్ను నమ్మండి.. నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను’ అని అంటున్నారు శ్రీముఖి. తాజాగా ఇన్‌స్టా వేదికగా తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి ఆమె బయటపెట్టారు.

Published : 27 May 2021 00:21 IST

హైదరాబాద్‌: ‘నన్ను నమ్మండి.. నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను’ అని అంటున్నారు శ్రీముఖి. తాజాగా ఇన్‌స్టా వేదికగా తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి ఆమె బయటపెట్టారు. చాలారోజుల తర్వాత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన శ్రీముఖి పలు విశేషాలు పంచుకున్నారు. ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని.. కాకపోతే లైఫ్‌ పార్ట్‌నర్‌ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

అభిమానులు అడిగిన పలు ప్రశ్నలు.. శ్రీముఖి చెప్పిన చిలిపి సమాధానాలు..

నన్ను పెళ్లి చేసుకుంటావా?

డోంట్‌ మ్యారీ బీ హ్యాపీ

అక్కా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?

ఇదెక్కడి దారుణంరా బాబు

మీ ఫోన్‌ నంబర్‌ చెప్తే మెస్సేజ్‌ చేస్తా?

9848032919 (ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్‌ నంబర్‌). దీనికి కాల్‌ చేయండి.

మీమర్స్‌ గురించి మీ అభిప్రాయం?

నాకు మీమ్స్‌ అంటే ఎంతో ఇష్టం. ఈ మధ్య కాలంలో మీమ్స్‌ని ఎక్కువగా మిస్‌ అవుతున్నా.

మీ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు?

రణ్‌వీర్‌ సింగ్‌

మీ తమ్ముడిని నేను ప్రేమిస్తున్నా?

అరేయ్‌ తమ్ముడా.. నీతో యూట్యూబ్‌ వీడియో చేయాలంటే నాకెంతో భయంగా ఉందిరా. వీడియో కింద నీ గురించే ఎక్కువ కామెంట్లు వస్తున్నాయ్‌.

పటాస్‌ మిస్‌ అవుతున్నాం?

నేను కూడా ఎంతో మిస్‌ అవుతున్నా

మీరు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? చాలామందికి ఈ డౌట్‌ ఉంది? క్లారిటీ ఇస్తే మేము సంతోషిస్తాం?

నాకు లవర్‌ లేరండి బాబు. నన్ను నమ్మండి

ఉన్నట్టుండి జాంబీ అపోకలిప్స్ వస్తే పరిస్థితి ఏమవుతుంది మాస్టారు?

ఏదో బ్లాక్, వైట్‌, యెల్లో ఫంగస్‌ అంటా!! నువ్వేమో జాంబీ అంటున్నావ్‌!!

మీరు నన్ను ప్రేమిస్తారా?

మిమ్మల్నే కాదు నా అభిమానులందర్నీ నేను ఇష్టపడతాను.

మీరు ఎప్పుడూ మానసిక ఒత్తిడికి గురికాలేదా?

గతంలో ఒకసారి నేను కూడా మానసిక కుంగుబాటుకు లోనయ్యాను. కానీ ధైర్యంగా కోలుకున్నాను. మానసిక కుంగుబాటుకు లోనవడం పెద్ద నేరం ఏమీ కాదు.

అక్కా.. బావ ఎప్పుడు వస్తాడు?

నేను కూడా ఎదురుచూస్తున్నాను.

అమెరికా ఎప్పుడు వస్తారు?

ప్రస్తుతానికి ఇంటి బయటకు వెళ్లడానికే దిక్కు లేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తప్పకుండా వస్తా.

సోషల్‌మీడియాలో చాలా యాప్స్‌ బ్యాన్‌ అవుతున్నాయి కదా. మీ నంబర్‌ ఇస్తే గూగుల్‌ పే, ఫోన్‌ పేలో చాట్‌ చేస్తా?

ఇదేందయ్యా ఇది. నేను చూడలా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని