Sukumar: అభిమాన పంట
అగ్ర దర్శకుడు సుకుమార్‌కు అభిమాన పంట పండింది. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఓ నవ హీరో తన రెండున్నర ఎకరాల పొలంలో యాభై రోజుల వరిపంటతో ప్రదర్శించారు. ఈ అరుదైన దృశ్యానికి కడప
అగ్ర దర్శకుడు సుకుమార్‌కు అభిమాన పంట పండింది. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఓ నవ హీరో తన రెండున్నర ఎకరాల పొలంలో యాభై రోజుల వరిపంటతో ప్రదర్శించారు. ఈ అరుదైన దృశ్యానికి కడప జిల్లాలోని బోరెడ్డిగారిపల్లి గ్రామం వేదికైంది. ఆ వివరాల్లోకి వెళితే... ‘దూరదర్శిని’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న సువీక్షిత్ బొజ్జా దర్శకుడు సుకుమార్‌కు వీరాభిమాని. ఆ అభిమానాన్ని చాటి చెప్పేందుకు సొంత గ్రామంలోని వ్యవసాయ భూమిలో సుకుమార్ రూపంతో కనిపించేలా వరి పంటని సాగు చేశారు. యాభై రోజుల తర్వాత డ్రోన్ కెమెరాతో ఆ పంటని చిత్రీకరించారు. సుకుమార్ పేరుపై ప్రత్యేకంగా ఓ పాటని కూడా సిద్ధం చేశారు. సుకుమార్ రూపంతోపాటు ‘పుష్ప 2’ పేరు కూడా కనిపించేలా పంట సాగు చేశాడు నవనీత్. ఇటీవలే తన కార్యాలయంలో ఆ పంటకు సంబంధించిన వీడియోని చూసిన సుకుమార్ ‘నా నోట మాట రావడం లేదు, నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషిమీద ఇంత అభిమానం ఉంటుందా?’ అంటూ సువీక్షిత్‌ని అభినందించారు. ఇటీవలే అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప 2’ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు సుకుమార్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు