Tasty Teja: బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి ‘టేస్టీ’ తేజ ఎలిమినేషన్‌..

Bigg boss season 7: తనదైన కామెడీ టైమింగ్‌తో బిగ్‌బాస్‌లో నవ్విస్తూ వచ్చిన టేస్టీ తేజ ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు!

Published : 06 Nov 2023 02:05 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg boss season 7) నుంచి టేస్టీ తేజ (tasty teja) ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్‌లో అమర్‌దీప్‌, రతిక, శోభ, ప్రియాంక, అర్జున్‌, తేజ, భోలే షావలి, ప్రిన్స్‌ యావర్‌లు ఉండగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన ‘టేస్టీ’ తేజ ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. హౌస్‌లోకి వచ్చిన నాటి నుంచి తేజ తనదైన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో అందరినీ నవ్విస్తూ వచ్చాడు. హౌస్‌లో ఏ గ్రూప్‌తోనూ కలవకుండా అందరితోనూ కలివిడిగా ఉంటూ మంచి మార్కులు కొట్టేశాడు.

ఇక శోభాశెట్టితో కలిసి తేజ చేసే హంగామా నవ్వులు పంచింది. శోభా టాటూ వేసుకోమంటూ బిగ్‌బాస్‌ కూడా తేజను ఆటపట్టించాడు. అయితే, నామినేషన్స్‌ వచ్చే సరికి చిన్న చిన్న కారణాలు చెప్పి, ఇంటి సభ్యులను నామినేట్‌ చేసేవాడు. అలా ఇటీవల పూజా మూర్తి, సందీప్‌ మాస్టర్‌లు ఎలిమినేట్‌ కావడంలో తేజ సిల్లీ రీజన్స్‌ కూడా ఒక కారణం. ఈ వారం జరిగిన నామినేషన్స్‌ అలాంటి కారణమే చెప్పి, తేజను శివాజీ నామినేట్‌ చేశాడు. అనూహ్యంగా ఓటింగ్‌లోనూ అతడికి తక్కువ ఓట్లు పడటంతో ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని