Salmankhan: పాముకాటుకు గురైన సల్మాన్‌.. ఆస్పత్రిలో చేరిన స్టార్‌ హీరో

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ పాముకాటుకు గురయ్యారు. గత కొన్నిరోజులుగా సల్మాన్‌ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజాము....

Updated : 26 Dec 2021 15:58 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ పాముకాటుకు గురయ్యారు. గత కొన్నిరోజులుగా సల్మాన్‌ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన్ని పాము కరిచింది. దీంతో, సల్మాన్‌ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ని ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. విషం లేని పాము కాటువేయడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. మరోవైపు సల్మాన్‌ పాముకాటుకు గురయ్యారని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని