Sivasankar: శివశంకర్ని కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు: చిరంజీవి
తన నృత్య రీతులతో ఎన్నో పాటలకు వన్నె తీసుకొచ్చి, ఎందరో నటులకు స్టార్డమ్ తెచ్చిన శివశంకర్ మాస్టర్ మరణం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది.
ఇంటర్నెట్ డెస్క్: తన నృత్య రీతులతో ఎన్నో పాటలకు వన్నె తీసుకొచ్చి, ఎందరో నటులకు స్టార్డమ్ తెచ్చిన శివశంకర్ మాస్టర్ మరణం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. కరోనా నుంచి కోలుకుని వస్తారనుకున్న ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. శివశంకర్ ఇకలేరన్న విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.
* శివశంకర్ మృతితో సినీ పరిశ్రమ ముద్దుబిడ్డను కోల్పోయింది. నృత్యం, నటనతో లక్షలమంది అభిమానాన్ని ఆయన సంపాదించారు.-చంద్రబాబు
* శివశంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచివేసింది. ఆయనా నేనూ కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. ‘ఖైదీ’ చిత్రంతో మా స్నేహం మొదలైంది. ఇటీవల ‘ఆచార్య’ సెట్లో కలుసుకున్నాం. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. ఆయన మృతి నృత్య కళకే కాదు యావత్ సినీ పరిశ్రమకే తీరనిలోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. - నటుడు చిరంజీవి
* శివశంకర్ మాస్టర్ చనిపోయారన్న వార్త విని నా గుండె పలిగింది. ఆయన్ను రక్షించేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. కానీ, భగవంతుడు ఇలా చేశాడు. మాస్టర్.. సినీ పరిశ్రమ మిమ్మల్ని మిస్ అవుతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. -నటుడు సోనూసూద్
* శివశంకర్ మాస్టర్ లేరన్న విషయం బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. - శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ
* కొవిడ్‌కు చికిత్స పొందిన శివశంకర్ మాస్టర్ కోలుకుంటారని భావించా. ఆయన కన్నుమూయడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శాస్త్రీయ నృత్యంలో పట్టున్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘మగధీర’లోని ఓ పాటకు జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. - నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.
* శివశంకర్ మాస్టర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. కొన్ని సినిమాలకు ఇద్దరం కలిసి పనిచేశాం. ఆయన మృతిపట్ల చింతిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా. - నటుడు బాలకృష్ణ.
* శివశంకర్‌గారు చనిపోయారన్న వార్త బాధను కలిగించింది. ‘మగధీర’ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి పంచింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. శివశంకర్ కుటుంబ సభ్యులకు నా సానుభూతి. - దర్శకుడు రాజమౌళి.
* శివశంకర్ మాస్టర్ నృత్యానికి బ్రాండ్ అంబాసిడర్. అనేక చిత్రాలకు అద్భుత నృత్యరీతులు సమకూర్చారు.-నారా లోకేశ్
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్‌సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..