Vijay Sethupathi: మీ దృష్టిలో ‘లాభం’ అంటే ఏంటి?

‘లాభం’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. విజయ్‌ సేతుపతి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది.

Published : 04 Sep 2021 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా విజయ్‌ సేతుపతి నటించిన చిత్రం ‘లాభం’. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబరు 9న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ కట్టాలనుకునే వ్యాపారవేత్తగా జగపతిబాబు, అది జరగకుండా రైతుల పక్షాన నిలిచే వ్యక్తిగా విజయ్‌ సేతుపతి కనిపించారు. ఇద్దరి నటన మెప్పిస్తోంది. ‘మార్కెట్టుకి వచ్చేటప్పుడు అందులో లాభం అనేది కలుస్తుంది. అదే నిలువు దోపిడీగా మారుతుంది. అక్కడే రెండు వర్గాలుగా చీలుతుంది’ అని సేతుపతి చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది. ‘మీ దృష్టిలో లాభం అంటే ఏంటి?’ అంటూ సాగే సన్నివేశం ఆకట్టుకునేలా ఉంది. మరి లాభం అంటే ఏంటి? సేతుపతి రైతుల సమస్యల్ని ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి ఎస్‌.పి. జననాథన్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌సేతుపతి, పి. అరుముగకుమార్‌ నిర్మించారు. ఇమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సేతుపతి సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని