Samantha: సామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ స్టెప్‌.. మరోసారి బోల్డ్‌ రోల్‌

తాను ప్రపంచంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా భారతదేశాన్ని గర్వపడేలా చేస్తానని అగ్రకథానాయిక సమంత అన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ విజయంతో సమం...

Updated : 26 Nov 2021 10:45 IST

హైదరాబాద్‌: తాను ప్రపంచంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా భారతదేశాన్ని గర్వపడేలా చేస్తానని అగ్రకథానాయిక సమంత అన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ విజయంతో సమంత ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆమెకు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా సమంత.. తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ స్టెప్‌ తీసుకున్నారు. త్వరలో ఆమె విదేశీ చిత్రంలో తళుక్కున మెరవనున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్‌ ఫిలిప్‌ జాన్‌ తెరకెక్కించనున్న ఇంగ్లిష్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ చిత్రంలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘‘పూర్తిగా సరికొత్త ప్రపంచం.. ‘అరెంజ్‌మెట్స్‌ ఆఫ్‌ లవ్‌’లో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా. అను పాత్ర కోసం నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ ఫిలిప్‌ జాన్‌. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌.. ‘‘ఇండియాలో గొప్ప నటి సమంత. ఇప్పుడు దేశాన్నే గర్వపడేలా చేయనుంది’’ అని ట్వీట్‌ చేయగా.. ‘‘తప్పకుండా’’ అని రిప్లై ఇచ్చారు.

భారత రచయిత తిమేరి ఎన్‌ మురారీ రచించిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ నవల ఆధారంగా చేసుకుని ఈసినిమా తెరకెక్కనుంది. ఇందులో ఆమె బై సెక్సువల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 2009లో విడుదలైన ‘ఏమాయ చేసావే’ సినిమా తర్వాత ఆమె ఈ సినిమా కోసమే ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆడిషన్స్‌లో పాల్గొనడం ఎంతో కంగారుగా అనిపించిందని సామ్ ఇన్‌స్టా వేదికగా తెలిపారు. మరోవైపు.. ‘సూపర్‌డీలక్స్‌’, ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ల్లో సమంత బోల్డ్‌ రోల్స్‌లోనే కనిపించిన విషయం తెలిసిందే.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని