Valimai: రయ్‌.. రయ్‌.. ‘వాలిమై’

తమిళ అగ్ర కథా  నాయకుడు అజిత్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాలిమై’. హెచ్‌.వినోద్‌ తెరకెక్కించారు. బోనీ కపూర్‌ నిర్మాత. తెలుగు యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా, సంక్రాంతి   ...

Updated : 16 Dec 2021 07:18 IST

మిళ అగ్ర కథా  నాయకుడు అజిత్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాలిమై’. హెచ్‌.వినోద్‌ తెరకెక్కించారు. బోనీ కపూర్‌ నిర్మాత. తెలుగు యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా, సంక్రాంతి     సందర్భంగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. సినిమాలో యాక్షన్‌ హంగామా ఏ స్థాయిలో ఉండనుందన్నది ఈ ప్రచార చిత్రంతో కాస్త రుచి చూపించే ప్రయత్నం చేశారు. అజిత్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, బైక్‌ చేజింగ్‌ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కార్తికేయ విభిన్నమైన లుక్‌లో కనిపించారు. ఓ బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశంలో అజిత్‌ అదుపుతప్పి కిందపడిపోవడాన్ని మేకింగ్‌ వీడియోలో చూపించారు. ఆ సీన్‌లో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు కనిపించినా.. వెంటనే లేచి ఆ ఫీట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ఆకట్టుకుంది. ఇందులో అజిత్‌ సీబీసీఐడీ అధికారిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా హ్యూమా ఖురేషి నటించింది. ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. దీనికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని