ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విరాళంగా ఇచ్చిన ఊర్వశి

బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలా తన నటన, అందంతో ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకుంది. అలనాటి అప్సరసలైన రంభ, ఊర్వశి, మేనకల్లో ఒకరి పేరు పెట్టుకున్నందకు ఆ పేరుకు సార్థకం చేసుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఊర్వశి పేరు తగ్గట్లే ఆపదలో ఉన్న కొవిడ్‌-19 బాధితులను ఆదుకుంటూ తన ఉదారతను చాటుకుంటుంది.

Updated : 30 Aug 2022 11:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ భామ ఊర్వశి తన నటన, అందంతో ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకుంది. ఆపదలో ఉన్న కొవిడ్‌-19 బాధితులను ఆదుకుంటూ  ఊర్వశి తన ఉదారతను చాటుకుంటోంది. ఈ అందాల భామ ఊర్వశి రౌతేలా ఫాండేషన్‌ ద్వారా మొత్తం 47 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను విరాళంగా ఇచ్చింది. మొదట ఉత్తరాఖండ్‌కి 27 ఇవ్వగా, మరో 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను వివిధ ఆస్పత్రులకు అందించింది. 2 కోట్ల 35 లక్షల విలువ చేసే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విరాళంగా ఇచ్చినందుకుగానూ, మంచిపని చేసిందంటూ పలువురు మెచ్చుకుంటున్నారు. ఆ మధ్య ముంబయిని ముంచెత్తిన తౌక్టే తుపాను సందర్భంలోనూ పలువురు పేదలకి మంచినీళ్లు ఆహార పొట్లాలను పంపిణీ చేసింది.  తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వచ్చే ఆదాయంతో దేశంలోని కొవిడ్‌ బాధితులకు సాయం చేస్తోంది.

ఇటీవల ఈజిప్టు నటుడు మహమ్మద్ రమ్దాన్‌ సరసన ‘వెర్సాస్ బేబీ’ అనే అంతర్జాతీయ ఆల్బమ్‌లో నటించింది. ఈ ఆల్బమ్‌కి మంచి స్పందన కూడా వచ్చింది. ఈ పాటకి వచ్చిన ఆదాయంతో భారతదేశంలోని కొవిడ్ -19 సహాయ నిధికి, పాలస్తీనా సొసైటీకి కొంత మొత్తం అందించారు.  ప్రస్తుతం ఊర్వశి తమిళంలో నిర్మితమయ్యే సైన్సు ఫిక్షన్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ చిత్రంలో నటించనుంది. ఇందులో ఆమె మైక్రోబయాలజిస్ట్‌గా కనిపించనుంది. తెలుగులో వస్తున్న ‘బ్లాక్‌ రోజ్‌’ చిత్రంలో నటిస్తోంది. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో  తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రమిది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. గత ఏడాది హిందీలో ‘వర్జిన్‌ భానుప్రియ’ అనే చిత్రంలో నటించి అలరించింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని