Published : 26 Oct 2020 22:24 IST

బ్రిటన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

లండన్‌‌: తెలంగాణ యూరప్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (టెకా) ఆధ్వర్యంలో బ్రిటన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో ప్రవాస తెలంగాణ ప్రజలు వర్చువల్‌ పద్ధతిలో ఈ వేడుకలు జరుపుకొన్నారు. కుటుంబ సమేతంగా ఉత్సాహంగా పాల్గొని ఆట పాటలతో సందడి చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో రోజూ వివిధ రకాల బతుకమ్మలను పేర్చారు. వీటి ప్రాముఖ్యతను పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆలపించిన బతుకమ్మ పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సంప్రదాయ వస్త్రధారణలో అంతా సందడి చేశారు. ఆన్‌లైన్‌లో బతుకమ్మ చేసుకుంటామని ఎవరమూ ఊహించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో అంతా కలిసికట్టుగా నిలబడి ఈ వేడుకలు జరుపుకోవడం గర్వకారణమని టెకా ప్రతినిధులు తెలిపారు. ఎంత దూరం వెళ్లినా మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకూడదనే ఉద్దేశంతోనే వేడుకలు జరుపుకొన్నట్టు వివరించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని