Updated : 09/12/2021 16:50 IST

ట్రంప్‌-బైడెన్‌.. ఎవరొచ్చినా వైఖరి మారదు!

భారత్‌తో సంబంధాలపై అమెరికా

దిల్లీ: భారత్‌-అమెరికా మధ్య జరగబోయే 2+2 చర్చల్లో చైనా సరిహద్దు అంశం సైతం చర్చకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామన్నారు. మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. చైనా దురాక్రమణపూరిత వైఖరిని నిలువరించాలంటే ఆగ్నేయాసియాలో భారత్‌ శక్తిమంతంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు దక్షిణ చైనా సముద్రంలో భారత్‌ తన సైనిక కార్యకలాపాల్ని వేగవంతం చేయడం.. ఆ ప్రాంతంలోని ఇతర మిత్రదేశాలతో కలిసి పనిచేయడం స్వాగతిస్తున్నామన్నారు. 

హిమాలయాల నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు చైనా దురుసు వైఖరిని ప్రదర్శిస్తోందని ట్రంప్‌ పాలకవర్గంలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారత్‌ వంటి మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ మేరకు రక్షణ విక్రయాలు, విన్యాసాలు, కీలక సమాచార మార్పిడి వంటి అంశాల్లో భారత్‌కు సహకారం అందిస్తున్నామన్నారు. 2016 తర్వాత భారత్‌-అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కిందన్నారు. 

అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా చైనా విషయంలో భారత్‌కు సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారినా ఈ విషయంలో పెద్దగా మార్పు ఉండదని తేల్చి చెప్పారు. అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలూ భారత్‌తో మెరుగైన సంబంధాల్నే కోరుకుంటున్నాయన్నారు.

భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చలు ఈ నెల 26-27 తేదీల్లో దిల్లీలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు- భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌లతో భేటీ కానున్నారు. ప్రాంతీయ భద్రతా సహకారం, రక్షణ సమాచార మార్పిడి, సైనిక సంప్రదింపులు, రక్షణోత్పత్తుల వ్యాపారంపై ప్రధానంగా చర్చించనున్నారు. అత్యంత కీలకమైన బేసిక్‌ ఎక్స్చేంజీ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని