కేసీఆర్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: లక్ష్మణ్‌

రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లో సహకరిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు.

Published : 02 Nov 2020 01:08 IST

హైదరాబాద్‌: రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లో సహకరిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. దోచుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని.. నూతన విద్యుత్‌ బిల్లుపై దష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం వాటా కింద ఇప్పటివరకు రూ.70 వేల కోట్లు తెలంగాణకు కేటాయించిందన్నారు. కేంద్ర సర్కార్‌ నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు రాలేదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ కనీస అవగాహన లేకుండా నిరాశ, నిస్ఫృహతో కేంద్రపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో తీసుకొచ్చిన నూతన వ్యవసాయం చట్టంపై సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు తమ పంటను నచ్చిన చోట అమ్ముకునే స్వేచ్ఛను కల్పిస్తూ కేంద్రం బిల్లు తెస్తే.. తమకు అనుయాయులుగా ఉన్న దళారులకు నష్టం కలుగుతుందనే కారణంతో అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని