అసలు ముఖ్యమంత్రి కేటీఆరే: నారాయణ

తెలంగాణ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి కేటీఆరే అని సీపీఐ నేత  నారాయణ వ్యాఖ్యానించారు.

Published : 21 Aug 2020 02:22 IST

వరంగల్‌: తెలంగాణ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి కేటీఆరే అని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ విశ్రాంతి తీసుకొని కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలన్నారు. వరంగల్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఇవాళ పర్యటించారు. జిల్లాకు తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెరాస నేతల ఆశీస్సులతోనే రాష్ట్రంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని, నాలాలు ఆక్రమించడం వల్లే వరంగల్‌కు వరద ముంపు ఏర్పడిందని నారాయణ విమర్శించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని