గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు చంద్రబాబు లేఖ

ఏపీలో వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Published : 18 Jul 2020 15:56 IST

అమరావతి: ఏపీలో వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ, పరిరక్షణ కోసం లేఖలో ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన అరెస్టులు, అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. రూ.5.20కోట్ల నగదు అక్రమ రవాణా కేసులో ఎమ్మెల్యే బాలినేనిపై తమిళనాడు అంతటా మీడియాలో ప్రసారమయ్యాయని, ఏపీలో మాత్రం నగదు రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టి సందీప్‌ చంద్రశేఖర్‌ అనే వ్యక్తిని అరెస్టు అని చంద్రబాబు ఆరోపించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని