రాంవిలాస్‌ మృతిపై దర్యాప్తు చేపట్టాలి: మాంఝీ

అనారోగ్యంతో కన్నుమూసిన లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాం విలాస్‌ పాసవాన్‌ మృతిపై జ్యుడిషియల్‌ దర్యాప్తు చేపట్టాలంటూ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీ డిమాండ్‌ చేయడం వివాదానికి దారితీసింది

Published : 02 Nov 2020 18:00 IST

ఖండించిన చిరాగ్‌

పట్నా: అనారోగ్యంతో కన్నుమూసిన లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాం విలాస్‌ పాసవాన్‌ మృతిపై జ్యుడిషియల్‌ దర్యాప్తు చేపట్టాలంటూ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీ డిమాండ్‌ చేయడం వివాదానికి దారితీసింది. మాంఘీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎల్జేపీ అధ్యక్షుడు, రాంవిలాస్‌ కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌.. ఇదంతా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కుట్ర అని ఆరోపించారు. అసలేం జరిగిందంటే..

రాంవిలాస్‌ మృతిపై జ్యుడీషియల్‌ దర్యాప్తునకు ఆదేశించాలంటూ మాంఝీ.. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆయన మృతిపై తనకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. రాంవిలాస్‌ అంత్యక్రియల్లో చిరాగ్‌ నవ్వుతూ కన్పించడాన్ని ఆయన ప్రశ్నించారు. రాంవిలాస్‌ ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒక్క హెల్త్‌ బులిటిన్‌ కూడా ఎందుకు విడుదల చేయలేదని అడిగారు. 

కాగా.. మాంఝీ లేఖపై చిరాగ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎంకు అనుమానాలుంటే ప్రధాని మోదీనే నేరుగా అడగొచ్చని అన్నారు. ప్రధాని మోదీ తనకు ప్రతిరోజూ ఫోన్‌ చేసి తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని చిరాగ్‌ చెప్పారు. ఇదంతా సీఎం నితీశ్‌ కుమార్‌ కుట్రే అని, ఎన్నికల సమయంలో తనను చెడుగా చూపించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి ఒక్కసారి కూడా మాంఝీ పరామర్శించలేదని దుయ్యబట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని