TMC-Congress: ‘ఎన్నో నెలలు ఎదురుచూశాం కానీ..’: కాంగ్రెస్‌పై మండిపడిన టీఎంసీ

తాము జాతీయస్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతామని తృణమూల్ కాంగ్రెస్‌(TMC) వెల్లడించింది.  

Updated : 30 Jan 2024 12:52 IST

కోల్‌కతా: సీట్ల సర్దుబాటు అంశంలో కాంగ్రెస్‌(Congress) వ్యవహరించిన తీరును తృణమూల్ కాంగ్రెస్(TMC) నేత అభిషేక్ బెనర్జీ విమర్శించారు. పశ్చిమ్‌బెంగాల్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమిలో విభేదాలకు ఆ పార్టీనే కారణమని మండిపడ్డారు.

‘కూటమి నిబంధనల ప్రకారం.. మొదట సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కిరావాలి. ఈ విషయంపై గత ఏడాది జులై నుంచి మేం ఎదురుచూశాం. కానీ కాంగ్రెస్‌ నుంచి ఏ స్పందనా రాలేదు. కాంగ్రెస్‌ సీనియర్ నేతలతో ఎన్నోసార్లు చర్చలు జరిపాం. సీట్ల సర్దుబాటుపై డిసెంబర్ 31 కల్లా  ఓ నిర్ణయానికి రావాలని చివరిసారి దిల్లీలో జరిగిన సమావేశంలో తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. అయినా సరే వారి నుంచి సమాధానం రాలేదు’ అని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. అలాగే బెంగాల్‌ కాంగ్రెస్ చీఫ్ అధిర్‌ రంజన్ చౌదరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ పార్టీ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది’ అని అన్నారు. అయితే జాతీయస్థాయిలో మాత్రం తాము విపక్ష కూటమిలోనే కొనసాగుతామని చెప్పారు.

మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. నియంతృత్వ పాలనకు నాంది పలికినట్లే

ఇటీవల బెంగాల్‌లో కాంగ్రెస్‌కు టీఎంసీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటుపై తాను చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్‌ తోసిపుచ్చిందని, దీంతో ఒంటరిగా పోటీకి దిగాలని నిర్ణయించినట్లు మమత వెల్లడించారు. కాంగ్రెస్‌, టీఎంసీల మధ్య పొత్తు విఫలం కావడానికి అధిర్‌ రంజన్‌ కారణమని టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రియెన్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని