Amit Shah: ఈనెల 28న తెలంగాణలో అమిత్‌ షా పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది.

Published : 26 Dec 2023 17:58 IST

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. డిసెంబరు 28న మధ్యాహ్నం 12.05 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌ షా.. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు. నోవాటెల్‌లో మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.45 గంటల వరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం 1.50 గంటలకు కొంగరకలాన్‌లో జరిగే భాజపా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని