AP POLITICS: పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సోము వీర్రాజు

రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.....

Published : 01 Aug 2021 17:50 IST

విశాఖపట్నం: రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ..  రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.11వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సంక్షేమ పథకాలకు రూ.64వేల కోట్లు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది... సంక్షేమ పథకాల కంటే సాగు, తాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం కాదా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని