UCC-Asaduddin Owaisi: ప్రధాని మోదీకి లౌకికవాదం అంటే అలర్జీ: అసదుద్దీన్‌ ఒవైసీ

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వస్తే ముస్లింలతో పాటు హిందువులకూ నష్టం జరుగుతుందని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. యూసీసీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు.

Updated : 10 Jul 2023 18:55 IST

హైదరాబాద్‌: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వస్తే అన్ని వర్గాలకూ నష్టం జరుగుతుందని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులతో కలిసి.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత అసదుద్దీన్‌ మాట్లాడారు. విజ్ఞప్తులతో సీఎంకు ఓ నోట్‌ ఇచ్చినట్లు తెలిపారు.

‘‘భారత్‌ అంటేనే.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. దాదాపు అన్నీ రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ట్రైబల్స్‌ ఉన్నారు. యూసీసీ వల్ల వారందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. హిందూ వివాహ చట్టమూ రద్దు అవుతుంది. యూనిఫాం సివిల్‌ కోడ్‌పై సీఎం కేసీఆర్‌తో చర్చించాం. యూసీసీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పాం. గత పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఈ బిల్లు ముస్లింలతో పాటు ఎవరికీ మంచిది కాదు. ప్రధాని మోదీకి లౌకికవాదం అంటే అలర్జీ. యూసీసీని కచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఈ బిల్లును భారాస వ్యతిరేకిస్తుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చిస్తామని కేసీఆర్‌ చెప్పారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని ఏపీ సీఎంను కూడా కోరుతున్నాం. యూసీసీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతాం. అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను కలుస్తాం’’ అని ఒవైసీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని