Atchannaidu: ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల వద్ద ఆందోళనలు: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్‌ గాలికొదిలేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Published : 09 Dec 2023 14:57 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్‌ (YS Jagan) గాలికొదిలేశారని తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. జగన్ రెడ్డి అసమర్థ పాలనతో ప్రకాశం (Prakasam) జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వృథాగా పోతోందని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా తమపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు. టీఎంసీ.. క్యూసెక్కు.. ఈ రెండింటికీ తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల (Irrigation Projects) దగ్గర ఆందోళనలు చేపడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని