రైతుల కంట కన్నీరు.. ఫామ్‌హౌస్‌ పంట పన్నీరులా కేసీఆర్‌ పాలన: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 8ఏళ్ల పాలనంతా రైతుల కంట కన్నీరు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పంట పన్నీరుగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి

Published : 09 Jun 2022 13:30 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 8 ఏళ్ల పాలనంతా రైతుల కంట కన్నీరు.. ఆయన ఫామ్‌హౌస్‌ పంట పన్నీరుగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ మేరకు సీఎంకు ఆయన 3 పేజీల బహింరంగ లేఖ రాశారు. కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తెరాస అసత్య ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు. వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచినందుకు ఈ సందర్భంగా ప్రధానికి బండి సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు.

‘‘రైతుబంధు నిధులు రూ.7500 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి. సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మరి రైతుబంధుకు, రైతు రుణమాఫీకి సకాలంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరం. రైతుబంధు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రైతులు రుణాలు తీసుకుంటూ అప్పుల పాలవుతున్నారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్రం ఇప్పటివరకు తెలంగాణలో రూ.5800 కోట్ల నిధులను జమచేసి రైతులను ఆదుకుంది. ఈ పథకంలో భాగంగా ఈ సీజన్ కోసం రూ.580 కోట్లను మే 31న కేంద్రం విడుదల చేసింది. ఫసల్‌ బీమా యోజన పథకం ద్వారా నష్టపోయిన రైతులకు చేయూతనిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు రైతులకు అందేలా చేయాలి. అందుకు తెలంగాణ ప్రభుత్వం బకాయిపడ్డ తమ వాటా నిధులను వెంటనే విడుదల చేయాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని