Telangana : కొత్త రాజ్యాంగం ఎందుకు రాయాలో తెరాస నేతలు చెప్పాలి: భాజపా

తెరాస నాయకులు దిక్కుతోచని స్థితిలో తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర

Updated : 04 Feb 2022 19:59 IST

హైదరాబాద్: తెరాస నాయకులు దిక్కుతోచని స్థితిలో తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో గుజ్జుల మాట్లాడుతూ.. కొత్త రాజ్యాంగం ఎందుకు రాయాలో తెరాస చెప్పాలన్నారు. కేంద్రం నుంచి నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్తున్నాయనే బాధతోనేననా? అని ప్రశ్నించారు. తెరాస అవినీతి బయటపడి, అరెస్ట్‌ అవుతామనే భయంతోనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా భాజపా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబమే ఎల్లకాలం అధికారంలో ఉండాలని రాజ్యాంగం రాస్తారా? దేశంలో సమానత్వం తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. 

ఎయిర్‌ ఇండియాను కేంద్రం అమ్మేసిందని ఆరోపణలు చేస్తున్నారని, మరి హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రభుత్వ భూములను ఎందుకు అమ్మారో తెరాస నేతలు చెప్పాలని ప్రేమేందర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు భాజపా ఆందోళనలు కొనసాగిస్తుందని తెలిపారు. తెరాస నేతలే కేసీఆర్‌పై వ్యతిరేకతతో ఉన్నారని, వారి పార్టీలోనూ చర్చ జరుగుతుందన్నారు. తెరాస, భాజపా ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. భాజపా నేతలపై అరెస్టులు, దాడులు కాంగ్రెస్‌కు కనిపించడం లేదా? ప్రేమేందర్‌ రెడ్డి అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని