Andhra News: అక్రమార్కులను ప్రోత్సహించేలా ప్రతిపక్ష నేతల వైఖరి: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలపై విపక్షాలది అనవసర రాద్ధాంతమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌, పేపర్‌..

Updated : 05 May 2022 13:48 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలపై విపక్షాలది అనవసర రాద్ధాంతమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌, పేపర్‌ లీక్‌ అనేది జరగలేదని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రశ్న పత్రాల విషయంలో ఇప్పటివరకు 60 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 38 మంది ప్రభుత్వ, 22 మంది ప్రైవేటు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్రిమినల్‌ కేసులు పెట్టినట్లు చెప్పారు. ఈ అంశంలో ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది ప్రమేయంపైనా విచారణ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. అక్రమార్కులను ప్రోత్సహించేలా ప్రతిపక్ష నేతల వైఖరి ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాలు ఊరుకుంటాయా?అని ప్రశ్నించారు. విద్య, వైద్యం.. ఈ రెండింటికి సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. తప్పు చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని