Mayawati: రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి.. ఎవరంటే..?

బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్ పేరును ప్రకటించారు. 

Updated : 10 Dec 2023 15:15 IST

లఖ్‌నవూ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధ్యక్షురాలు మాయావతి (Mayawati) కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ (Akash Anand) పేరును ప్రకటించారు. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఆకాశ్‌ ఆనంద్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు ఆయన చేపట్టనున్నారు.

ఆకాశ్‌ ఆనంద్‌ మాయావతి తమ్ముడి కుమారుడు. 2016లో బీఎస్పీలో చేరిన ఆకాశ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రతోపాటు, ఇటీవల డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్‌ యాత్రలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ పేరును ప్రకటించడం పార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మాయావతి తర్వాత అధ్యక్ష పదవి ఎవరు చేపడతారన్న  చర్చకు తెరదించినట్లైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని