Chandrababu: పింఛన్లు డోర్‌ డెలివరీ చేయొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదు: చంద్రబాబు

రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Updated : 05 Apr 2024 14:35 IST

నల్లజర్ల: రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జగన్‌ (YS Jagan) తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.  తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని.. బాబాయ్‌ను చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని వ్యాఖ్యానించారు. వైకాపా నేతలు శవరాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పింఛన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టి వారికి తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణమన్నారు. వాలంటీర్‌ వ్యవస్థను తామూ కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. 

‘‘పింఛన్లపై జరుగుతున్న కుట్రలో అధికారులు భాగస్వాములు కావడం దుర్మార్గం. ఓడిపోతామని తెలిసే రూ.13వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. పింఛన్లు డోర్‌ డెలివరీ చేయొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదు. నగదును ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి కదా! వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని ఈ పన్నాగం పన్నారు. మీ స్వార్థం కోసం ఇబ్బంది పెడతారా? వారిపై కేసులు పెడితే ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీ గెలుపు కోసం వాలంటీర్లను బలి పశువులను చేస్తారా?’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని