Chandrababu Arrest: రాజకీయ కక్షతో చంద్రబాబు అరెస్టు : బండి సంజయ్‌

తెదేపా అధినేత చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారనే విషయం అర్థమవుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు.

Updated : 14 Sep 2023 13:10 IST

కరీంనగర్‌: తెదేపా అధినేత చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారనే విషయం అర్థమవుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరూ కాదనరని చెప్పారు. కానీ, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని అరెస్టు చేయడమే తనకు అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రజలు తిరగబడే పరిస్థితి భవిష్యత్‌లో వస్తుందన్నారు. మాజీ సీఎంను ఆదరాబాదరాగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. జీ-20 సమావేశాల సమయంలోనే అరెస్టు చేయడానికి పోలీసులకు సమయం కుదిరిందా అని ప్రశ్నించారు. తాజా అరెస్టుతో ఏపీ ప్రజల్లో చంద్రబాబుకు మైలేజ్‌ వచ్చిందని తెలిపారు. తప్పును తప్పు అని చెబితే చంద్రబాబు ఏజెంట్‌ అని ముద్ర వేసే దురలవాటు వైకాపా నేతలకు ఉందని విమర్శించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని