CM Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: జగన్‌

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. దీన్ని తాను గట్టిగా నమ్ముతున్నట్లు ఏపీ సీఎం జగన్‌(CM Jagan) అన్నారు.

Updated : 01 Jun 2023 13:37 IST

పత్తికొండ: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. దీన్ని తాను గట్టిగా నమ్ముతున్నట్లు ఏపీ సీఎం జగన్‌(CM Jagan) అన్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ‘వైఎస్‌ఆర్‌ రైతుభరోసా’ (YSR Rythu Bharosa) నిధులను సీఎం బటన్‌ నొక్కి విడుదల చేశారు.  ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 52.31 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.3,923.21 కోట్లను జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ వరుసగా ఐదో ఏడాది ‘రైతు భరోసా’ తొలి విడత నిధులు విడుదల చేస్తున్నామన్నారు. పెట్టుబడి రాయితీ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ రంగంలో రైతులకు అన్నివిధాలా అండగా ఉంటున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఏ సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని ఆ సీజన్‌లోనే చెల్లిస్తున్నామన్నారు. 

తెదేపా మేనిఫెస్టోపై విమర్శలు

మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై జగన్‌ విమర్శలు గుప్పించారు. ఆ మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ఇచ్చిన హామీలతో పాటు వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో తెదేపా మేనిఫెస్టో ప్రకటించారన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులు, ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్‌ ఆరోపించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని