Telangana News: తెరాస పేరు బీఆర్‌ఎస్‌ కంటే వీఆర్‌ఎస్‌గా మారిస్తే బాగుంటుంది: జైరామ్‌ రమేశ్‌

మన దేశానికి భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు తెరాసతోనూ ప్రమాదముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు. జాతీయ స్థాయిలో తెరాస పేరు బీఆర్‌ఎస్‌ కంటే వీఆర్‌ఎస్‌గా మారిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

Published : 05 Oct 2022 01:55 IST

హైదరాబాద్‌: మన దేశానికి భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు తెరాసతోనూ ప్రమాదముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు. జాతీయ స్థాయిలో తెరాస పేరు బీఆర్‌ఎస్‌ కంటే వీఆర్‌ఎస్‌గా మారిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో భారత జోడో యాత్రపై నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. భేటీలో సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌సింగ్‌, కొప్పుల రాజు, మాణికం ఠాగూర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క పలువురు  నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో భారత జోడో యాత్ర 13 రోజుల కార్యక్రమంగా చూడకూడదని, తెలంగాణ కాంగ్రెస్‌ భారత జోడో యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తుందని జైరామ్‌ రమేశ్‌ వివరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎలాంటి మార్పు తీసుకు రాలేవన్న దిగ్విజయ్‌సింగ్‌.. పేరు మారిస్తే ఎలాంటి ఫలితం ఉండబోదని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని