Telangana News: ఆ పని చేస్తే రోజుకొకరి బండారం బయటపెడతా: జగ్గారెడ్డి

నగరంలోని అశోక హోటల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమావేశం ముగిసింది. సమావేశం వద్దకు మానవతారాయ్‌, అద్దంకి దయాకర్‌, బెల్లయ్య నాయక్‌ వెళ్లారు. కాగా ముగ్గురిని జగ్గారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాలని

Updated : 20 Mar 2022 16:17 IST

హైదరాబాద్‌: తమకు పార్టీ షోకాజ్‌ నోటీస్‌ ఇస్తే సమాధానం చెబుతామని.. సస్పెండ్‌ చేసే దమ్ము ఎవరికీ లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనను సస్పెండ్‌ చేస్తే రోజుకొకరి బండారం బయటపెడతానని హెచ్చరించారు. అశోక హోటల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల ‘ప్రత్యేక’ భేటీ ముగిసిన అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘సస్పెండ్‌ చేసినా అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటా. రేవంత్‌ నా సవాలు స్వీకరిస్తే నేను రాజీనామా చేస్తా. నా స్థానంలో అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే రేవంత్‌ హీరో అని ఒప్పుకుంటా. నేను గెలిస్తే నేను హీరో, ఇద్దరం ఓడితే ఇద్దరం జీరోలమే. పార్టీ సిద్ధాంతంలో రేవంత్‌ పని చేయడం లేదు. వీహెచ్‌ తన కూతురు సమస్యపై హరీశ్‌రావును కలిస్తే తప్పేంటి?’’ అని జగ్గారెడ్డి నిలదీశారు. అంతకుముందు సమావేశం వద్దకు కాంగ్రెస్‌ నేతలు మానవతారాయ్‌, అద్దంకి దయాకర్‌, బెల్లయ్య నాయక్‌ వెళ్లగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని జగ్గారెడ్డి వారికి సూచించారు. దీంతో ఆ ముగ్గురూ వెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని