కేంద్ర బృందాలకు బెంగాల్‌ సహాయ నిరాకరణ!

పశ్చిమ్‌ బెంగాల్‌ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని రాష్ట్రంలో పర్యటిస్తున్న కొవిడ్‌-19 అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందాలు అంటున్నాయి. సమాచారం అడిగినా ఇవ్వడం లేదని, లాజిస్టిక్స్‌ సహాయం చేయడం లేదని విమర్శించాయి....

Published : 26 Apr 2020 00:54 IST

కోల్‌కతా: పశ్చిమ్‌ బెంగాల్‌ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని రాష్ట్రంలో పర్యటిస్తున్న కొవిడ్‌-19 అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందాలు అంటున్నాయి. సమాచారం అడిగినా ఇవ్వడం లేదని, లాజిస్టిక్స్‌ సహాయం చేయడం లేదని విమర్శించాయి.

దిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని గుర్తించడం, క్వారంటైన్‌కు తరలించడం సహా తీసుకున్న చర్యల వివరాలు అడుగుతూ ఒక ఐఎంసీటీకి నేతృత్వం వహిస్తున్న అపూర్వ చంద్ర బెంగాల్‌ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కోల్‌కతాకు వచ్చాక తాము రాసిన లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.

‘నేటికి ప్రభుత్వానికి నాలుగు లేఖలు రాశాం. ఇప్పటి వరకు స్పందన లేదు. ఐఎంసీటీ రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించొచ్చని, వారితో కూడి రాష్ట్ర ప్రభుత్వ సమయం వృథా చేసుకోదని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి మీడియాలో విస్తృతంగా చెబుతున్నారు. ఇది కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది. క్షేత్ర స్థాయి పర్యటన, లాజిస్టిక్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి’ అని చంద్ర మరోసారి సిన్హాకు రాసిన లేఖలో ప్రస్తావించారు.

టీఎంసీ తీవ్ర విమర్శలు

ఇదిలా ఉండగా బెంగాల్‌ ప్రభుత్వం కేంద్ర బృందాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఐఎంసీటీ బృందాలు రాష్ట్రంలో రాజకీయ వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించింది. వీటిని భారత అత్యంత విచక్షణ రహిత బృందాలుగా వర్ణించింది.

‘అనుకున్నట్టుగానే బెంగాల్లో ఐఎంసీటీ పర్యటనకు ఓ లక్ష్యం లేదు. కరోనా ప్రజ్వలన కేంద్రాలు లేని జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఏర్పాటైన ఆడిట్‌ కమిటీ గురించి ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ వైరస్‌ను వ్యాపింపజేయడమే వీరి ముఖ్య ఉద్దేశం. సిగ్గులేకుండా వారీ దుశ్చర్యకు పాల్పడుతున్నారు’ అని రాజ్యసభలో టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: కరోనా రోగులకు నాసా ప్రత్యేక వెంటిలేటర్‌

చదవండి: భారత్‌లో కొత్త కేసుల వృద్ధిరేటు 6%

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని