Mamata Banerjee: మమతపై అధికరణం 167 అస్త్రం!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ రాజ్యాంగ అధికరణం 167ను సంధించారు. 

Published : 21 Dec 2021 09:50 IST

పెగాసస్‌ దర్యాప్తు కమిటీ నోటిఫికేషన్‌ 
జారీ ప్రక్రియ రికార్డులు పంపించండి
బెంగాల్‌ ముఖ్యమంత్రికి గవర్నర్‌ ధన్‌ఖడ్‌ లేఖ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ రాజ్యాంగ అధికరణం 167ను సంధించారు. ప్రముఖుల ఫోన్లపై పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కమిటీ నియామకం కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్, సంబంధిత ప్రక్రియ రికార్డులను తనకు పంపించాలని ఆదేశిస్తూ గవర్నర్‌ సోమవారం మమతకు లేఖ రాశారు. అధికరణం 167 ప్రకారం..రాష్ట్ర గవర్నర్‌ కోరిన సమాచారాన్ని ముఖ్యమంత్రి విధిగా అందజేయాల్సి ఉంటుంది. దర్యాప్తు కమిటీ నియామకంపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరలేదని ఆ లేఖలో ధన్‌ఖడ్‌ ఆరోపించారు. నోటిఫికేషన్‌లో మాత్రం గవర్నర్‌ అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారంటూ ఆక్షేపించారు. ‘పెగాసస్‌ వివాదంపై దర్యాప్తు కమిటీ నియామకం కోసం 26.07.2021న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందజేయడంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేది విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో అధికరణం 167ను ఉపయోగించక తప్పడంలేద’ని ధన్‌ఖడ్‌ ట్వీట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని