OTT : ఓటీటీ ప్లాట్‌ఫాంను సెన్సార్‌ పరిధిలోకి తేవాలి: కూనంనేని

ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారం అవుతున్న రానా నాయుడు, మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Published : 20 Mar 2023 07:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారం అవుతున్న రానా నాయుడు, మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. తెలుగు ప్రజలకు మంచి కుటుంబ చిత్రాలను అందించిన దగ్గుబాటి రామానాయుడు కుటుంబ సభ్యుల నుంచి రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ రావడం దురదృష్టకరమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫాంను తక్షణమే సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.

పంటల నష్టాన్ని అంచనా వేయాలి: చాడ

ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే చేయించి నష్టపరిహారం అందించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని