గుజరాత్‌లో ‘ఫసల్‌ బీమా’ ఎందుకు అమలు చేయరు?

తెలంగాణలో ఫసల్‌ బీమా యోజన అమలుచేయాలని అడుగుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ముందు ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎందుకు అమలుచేయడం లేదో చెప్పగలరా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

Published : 25 Mar 2023 03:58 IST

సంజయ్‌కు మంత్రి హరీశ్‌ ప్రశ్న

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఫసల్‌ బీమా యోజన అమలుచేయాలని అడుగుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ముందు ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎందుకు అమలుచేయడం లేదో చెప్పగలరా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘‘దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్‌ బీమాను వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదన్నది దీన్నిబట్టి అర్థం కావడం లేదా?’’ అంటూ బండి సంజయ్‌ను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘‘పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్‌ ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.228 కోట్లు సాయం ప్రకటించి రైతుబిడ్డ అని మరోసారి నిరూపించుకున్నారు. భాజపా నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. దేశంలో ఎక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా? నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. నేడు అదానీ ఆదాయాన్ని డబుల్‌ చేశారు. పంటల సాగు, రైతు సంక్షేమం గురించి భాజపా నేతలు మాట్లాడటం హాస్యాస్పదం’’ అంటూ ట్విటర్‌ వేదికగా హరీశ్‌రావు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని