2024లో రాష్ట్రంలో రాజకీయ సునామీ

రాష్ట్రంలో 2024లో రాజకీయ సునామీ రాబోతుందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Published : 26 Mar 2023 04:39 IST

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: రాష్ట్రంలో 2024లో రాజకీయ సునామీ రాబోతుందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అందులో వైకాపా కొట్టుకుపోతుందని..అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. శనివారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని, కొందరు మాత్రమే బయటపడుతున్నారని చెప్పారు. వైకాపాను శాశ్వతంగా డిస్మిస్‌ చేయాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా తడ నుంచి ఇచ్ఛాపురం వరకు శాశ్వతంగా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. తనను సస్పెండ్‌ చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం సమర్థనీయమని, విధానం మాత్రం అప్రజాస్వామికమని తప్పుబట్టారు. షోకాజ్‌ నోటీసు జారీ చేయకుండా సస్పెండ్‌ చేయకూడదని తెలిపారు. స్వచ్ఛందంగా రెండు నెలల ముందే పార్టీకి దూరంగా ఉన్నానని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు